కాకినాడ జిల్లాకు రెండు కొత్త ఇసుక రీచ్ లు కేటాయింపు
కాకినాడ జిల్లాకు రెండు కొత్త యిసుక రీచ్ లను ప్రభుత్వం కేటాయించడం జరిగిందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ విధాన గౌతమి హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కాకినాడ జిల్లాకు ఇసుక రిచ్ లు లేకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో రెండు ఇసుక రీచ్ లను కేటాయించడం జరిగిందని తెలిపారు.