కాకినాడ: ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంపై ప్రజలకు అవగాహన
ప్రధాన మంత్రి సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులు సమావేశాన్ని నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ యోజన ప్రజలకు అవగాహన కల్పించే నిమిత్తం రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు.