ఎస్ఇజెడ్ చుట్టూ కూటమి ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని వైసిపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ రూరల్ వైసిపి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ ఇ జెడ్ భూములను జగన్ ప్రభుత్వం తిరిగి రైతులకు అప్పగించడం పెద్ద తప్పుగా చూపిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొండంగి భూమిని తీసుకోవడం జరిగిందన్నారు.