కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో అక్రమ మట్టి రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులు లంకల్లో మట్టిని అక్రమంగా లారీలు, ట్రాక్టర్లలో తరలించి ఇటుక బట్టీలకు సరఫరా చేసి సొమ్ములు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం రాత్రి 10 గంటల సమయంలో హైవేపై మట్టి లారీలు హల్ చల్ చేస్తున్నా, సంబంధిత శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.