రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సుబ్బారావు ఉత్తమ సేవ అవార్డు

64చూసినవారు
రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ సుబ్బారావు ఉత్తమ సేవ అవార్డు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ జి. సుబ్బారావు కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. అమలాపురంలో గురువారం జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా సుబ్బారావు ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జెసి టి. నిషాంతి, మార్కెటింగ్ ఆఫీసర్ విశాలాక్షి, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్