కొవ్వూరులో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు

64చూసినవారు
కొవ్వూరులో అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు
కొవ్వూరు పట్టణంలోనే శుక్రవారం బ్రిడ్జి పేట 14వ వార్డు వద్ద అంబేద్కర్ 68వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యూత్ ప్రెసిడెంట్ మల్లవరపు రాజు మాట్లాడుతూ.. అంబేద్కర్ కృషి పట్టుదల సేవలని గుర్తించి వివరించారు. 1956 డిసెంబర్ 6న ముంబైలో తన స్వగృహంలో తుది శ్వాస విడిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పేట అంబేద్కర్ యూత్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్