కొవ్వూరు నియోజకవర్గంలో ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 336 ఓటర్లు ఓటు హక్కును వినియోగించేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. గురువారం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి 2 గంటలలో 65 ఓట్లు నమోదు కాబడినవి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.