కుండలేశ్వరం రోడ్డులో గుంత

52చూసినవారు
కుండలేశ్వరం రోడ్డులో గుంత
కాట్రేనికోన మం. కుండలేశ్వరం ఆర్అండ్ బి రోడ్డు వర్షాలకు శ్రీరామ్ నగర్ సమీపంలో కుంగింది. ఇక్కడ ఓల్డ్ అయినాపురం డ్రెయిన్ కు ఉన్న మురుగు బోదేపై కల్వర్టు వద్ద గతేడాది గుంత ఏర్పడింది. అదికారులు తాత్కాలికంగా గ్రావెల్ వేసి వదిలేశారు. ఇటీవల వర్షాలతో మట్టి కరిగిపోయి రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది. ఇటుగా రాకపోకలు సాగించేవారు అదుపు తప్పితే అపాయమేనని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్