కాట్రేనికోన: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్సై అవినాష్

79చూసినవారు
కాట్రేనికోన: విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: ఎస్సై అవినాష్
విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉత్తమ పౌరులుగా రాణించాలని కాట్రేనికోన ఎస్సై అవినాష్ మంగళవారం పేర్కొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం నందు మహిళా సంరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణ, యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్ వంటి విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఎస్ కేఆర్ఎం కుమార్,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్