మామిడికుదురు: ఆరోగ్యవంతమైన గ్రామాల ఏర్పాటే లక్ష్యం: ఎంపీడీవో

68చూసినవారు
ఆరోగ్యవంతమైన గ్రామాలే లక్ష్యంగా ముందుకు సాగుదాం అంటూ ఎంపీడీవో వెంకటేశ్వరరావు సూచించారు. మామిడికుదురు మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. సర్పంచులు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ససివాలయ ఉద్యోగులకు 9 అంశాలపై శిక్షణ ఇచ్చారు. పేదరికం నిర్మూలన, సంపూర్ణ పారిశుద్ధ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈవోపీఆర్డి శ్రీనివాస్, ఎంఈఓలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్