కాట్రేనికోన మం. కుండలేశ్వరం, పల్లిపాలెంలలో వరద ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు గురువారం పరిశీలించారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యంతోపాటు నిత్యావసరాలు అందించామన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అవసరమైన రక్షణ చర్యలు చేపట్టామన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే వివేకానంద, గ్రంథి నానాజీ, కముజు లక్ష్మీరమణారావు, విత్తనాల బుజ్జి తదితరులు పాల్గొన్నారు.