చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి

53చూసినవారు
చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
రాష్ట్రంలో అరాచక పాలనతో వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ప్రజలకు మేలు జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ముమ్మిడివరం నియోజకవర్గ తెదేపా, జనసేన, బాజపా ఉమ్మడి అభ్యర్ధి దాట్ల బుచ్చిబాబు అన్నారు. కొత్తలంక, కర్రివాని రేవు, బూరుగుపేట గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, గొలకోటి దొరబాబు, తాడి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్