ఐ. పోలవరం పంచాయతీ పెదమడికి చెందిన 30 కుటుంబాలు వైసీపీని వీడి మంగళవారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుత్తుల సాయి, గుత్తుల వెంకన్నబాబు ఆధ్వర్యంలో ముమ్మిడివరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చేరిన వారిలో మేడిశెట్టి గంగిశెట్టి, మేడిశెట్టి వెంకటేశ్వరరావు, గుత్తుల గురుమర్తి, విత్తనాల ప్రసాద్, కడలి అర్జునరావు, పాటి రాంబాబు, గుబ్బల రాజేంద్రప్రసాద్ తదితరులున్నారు.