కౌడా చైర్మన్ గా నియమితులైన తుమ్మల దొరబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆదివారం ఆపశృతి చోటుచేసుకుంది. నాయకులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో స్టేజి మీదకు ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజీ కూలిపోయింది. వేదికపై ఆశీనులయి ఉన్న ఎమ్మెల్యే చినరాజప్ప, మాజీ మంత్రి యనమల స్వల్ప గాయలతో బయటపడ్డారు. అనంతరం తుమ్మల బాబు ప్రమాణ స్వీకారం కొనసాగించారు.