ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ఆమరణ దీక్షలతో ప్రాణాన్ని త్యజించిన్నపొట్టి శ్రీరాములు చిరస్మరనీయులని సామర్లకోట తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు సామర్లకోట మఠం సెంటర్ ఎన్ టీ ఆర్ పార్కు వద్ద ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.