గొల్లప్రోలు: ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

62చూసినవారు
గొల్లప్రోలు: ఎరువుల దుకాణంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు
గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేంకటేశ్వర ఏజెన్సీలో ఎరువుల నిల్వలు, దస్త్రాల్లో లోపాలను గుర్తించి కేసు నమోదు చేసి రూ. 1, 41, 050 విలువైన 4. 4 టన్నుల ఎరువులను సీజ్ చేశారు. అనంతరం గంగా ట్రేడర్స్ దుకాణంలో రూ. 17, 284 విలువైన వివిధ రకాల మందులు 9 లీటర్ల తేడాలు గుర్తించి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్