పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ఆదివారం విజయవాడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతుండగా గట్టిగా మాట్లాడాలని అభిమానులు కోరారు. వర్ధంతి కదా.. అరిస్తే బాగోదు అంటూ పవన్ ఛలోక్తి విసిరారు. మహనీయుల వర్దంతి, జయంతిలు చేయాలని, భవిష్యత్తు తరాలకు వారి సేవలను తెలిసేలా చేయాలని అన్నారు.