పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ నవంబర్ నెల సాధారణ సమావేశం శనివారం జరుగుతుందని కమిషనర్ కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు చైర్ పర్సన్ గండేపల్లి సూర్యావతి అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుందన్నారు. పలు ఎజెండా అంశాలతో పాటు, వార్డుల్లో సమస్యలపై చర్చ జరుగుతుందని కావున ఈ సమావేశానికి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు హాజరుకావాలని కోరారు.