రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రాజమండ్రిలోని పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో 34 అర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.