గ్రామాల్లో భూ వివాదాలు పరిష్కారానికి ఈ నెల 10 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ తహశీల్దార్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ, గ్రామ అధికారులు సదస్సుల్లో పాల్గొని 22ఏ, ప్రీహెూల్డ్, భూఆక్రమణలపై బాధితుల నుంచి ఫిర్యా దులు స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. పరిష్కరించలేనివి నిర్దేశిత ప్రొసీజర్ ప్రకారం పరిష్కరిస్తారని తెలిపారు.