మధురపూడి నుంచి ముంబైకి ఫ్లైట్

52చూసినవారు
రాజమండ్రి సమీపంలో ఉన్న మధురపూడి విమానాశ్రయం నుంచి ముంబైకి నేరుగా విమాన సర్వీసు ప్రారంభించినట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆదివారం సాయంత్రం మధురపూడి విమానాశ్రయం నుంచి 120 మంది ప్రయాణికులతో ముంబైకి ఫ్లైట్ బయలుదేరిందని తెలిపారు. డిసెంబర్ 12 నుంచి ఢిల్లీకి నేరుగా విమాన సర్వీస్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇరు నగరాల మధ్య ప్రయాణ సమయం గంట 50 నిమిషాల వ్యవధి పడుతుందన్నారు.

సంబంధిత పోస్ట్