తూర్పు గోదావరి జిల్లా సీతానగరం గ్రామ పంచాయతీ పరిధిలో అతిసారం కేసులు కలవరపెడుతున్నాయి. లంకూరు, దళితపేట, వడ్డెరపేట పరిధిలోని పలు కుటుంబాలకు చెందిన సుమారు 20 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దాంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీశారు. కొందరి పరిస్థితి విషమించడంతో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.