రాజానగరం మండలం జి. యర్రంపాలెంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని గురువారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డు వెంకటరమణ చౌదరీ, బీజేపీ ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి ప్రారంభించారు. ముందుగా ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు