రోడ్డు ప్రమాదంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ మృతి

53చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం గ్రామంలో వెలంకాయల కాలవగట్టు ప్రాంతానికి చెందిన సుజాత కేశదాసుపాలెం హైస్కూల్లో హెడ్ మాస్టర్గా విధులను నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ నిమిత్తం ఆమె స్కూటీపై వెళ్తూండగా గొయ్యిని తప్పించే ప్రయత్నంలో పడిపోవడంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. కాకినాడ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల పలువురు ఉపాధ్యా యులు సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్