రాజోలు మండలంలో ఓఎన్జీసీ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకులు ప్రారంభోత్సవం కార్యక్రమం సోమవారం జరిగింది. వేగివారిపాలెం ఎస్సీ కాలనీలో రూ. 33. 06 లక్షలతో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ను, పొన్నమండ గ్రామంలో రూ. 33. 21 లక్షలతో నిర్మించిన 90 వేల లీటర్ల వాటర్ ట్యాంక్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఓఎన్జీసీ ఈడీ అసెట్ మేనేజర్ దాసు సంయుక్తంగా ప్రారంభించారు.