సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలో నీటి సంఘం ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు కమిడి రాజీవ్ భూషణ్, గొల్లమందల కిన్ను, ఇంజేటి స్వామి దాస్ విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన విజేతలను మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు శనివారం సన్మానించారు. విజేతలకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. పలువురు వైసీపీ నేతలు కార్యక్రమంలో పాల్గొని నీటి సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన వారిని సత్కరించారు.