సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే
కాకినాడ జిల్లా తుని పట్టణ బాలికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరై ప్రత్యేకంగా ప్రసంగించారు. అన్ని వృత్తిలలో ఉపాధ్యాయ వృత్తి చాలా ఉత్తమమైనదని, సమాజానికి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత వారిదని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయ వృత్తిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే ఉపాధ్యాయులు ఆయన ఘనంగా సత్కరించారు.