ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించొద్దని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. తేటగుంట టీడీపీ కార్యాలయంలో శనివారం ఆర్డీవో సీతారామరావు, మత్స్యశాఖ, ఆర్ అండ్ బి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్న వారిపై చర్యలకు వెనకాడవద్దన్నారు. అనుమతులు లేకుండా ఇసుక గ్రావెల్ తవ్వరాదన్నారు. గొల్ల అప్పారావు సెంటర్లో నిర్మించిన ఆక్రమ భవనాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.