కాకినాడ జిల్లా తుని పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా కేదరేశ్వర వ్రత వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుండి ఉపవాసంతో వుండి నదిలో దీపాలను వదిలారు. కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన రోజు కార్తీక పౌర్ణమి కావడంతో భక్తులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కుటుంబ సభ్యులతో కేదారేశ్వర వ్రత పూజలు నిర్వహించుకున్నారు.