కాకినాడ జిల్లా తుని పట్టణంలోని మున్సిపల్ పార్కులో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, నివాళులర్పించారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, కౌన్సిల్ బీసీ నాయకులు పాల్గొన్నారు.