చల్లపల్లి: మిల్లర్ల దోపిడీ నుండి రైతులను రక్షించాలి

59చూసినవారు
మిల్లర్ల దోపిడీని అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. వి. వి. ప్రసాద్ డిమాండ్ చేశారు. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దివిసీమ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని ఏపీ రైతు సంఘం నేతల బృందం ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసాద్ చల్లపల్లి మండలం వక్కలగడ్డలో మాట్లాడుతూ రైతుల కష్టాన్ని ఆసరాగా చేసుకుని మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్