సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఉపసభాపతి

70చూసినవారు
మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ అంచనాల కమిటీ చైర్మన్, మాజీ ఉపసభాపతి బూరగడ్డ వేదవ్యాస్ మంగళవారం దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో వేదవ్యాస్ దంపతులను స్వాగతించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్