అనువైన చోట నివేశనా స్థలాలు కేటాయించాలి

57చూసినవారు
అనువైన చోట నివేశనా స్థలాలు కేటాయించాలి
అనువైన చోట నివేశనా స్థలాలు కేటాయించాలని లబ్ధిదారులు మోపిదేవి జెడ్పిటిసి సభ్యులు మల్లికార్జునరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం మోపిదేవిలో చిరువోలులంక గ్రామానికి చెందిన 52 మంది లబ్ధిదారులు ఆయనను కలిసి తమ సమస్యను వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉండడానికి కూడా వీలు లేని స్థలాలను చూపించి పట్టాలు ఇచ్చారని తెలిపారు. అక్కడ మేము ఉండలేమని అనువైన స్థలం కేటాయించాలని ఆయనను కోరారు.

సంబంధిత పోస్ట్