రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని మండల పరిషత్ కో - ఆప్షన్ సభ్యులు చందన రంగారావు అన్నారు. మోపిదేవి మండల పరిధిలోని కే. కొత్తపాలెం గ్రామ సచివాలయం వద్ద మంగళవారం సర్పంచ్ కొక్కిలిగడ్డ మాధవి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం రెవెన్యూ సదస్సు సమావేశాన్ని నిర్వహించారు. తాహసిల్దార్ మేడపాటి శ్రీవిద్య గ్రామస్తుల నుంచి భూ సమస్యలపై వినతి పత్రాలను స్వీకరించారు.