కోడి పందాల శిబిరంపై పోలీసుల దాడి. మండలంలోని కోళ్ల పందాల శిబిరంపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రుద్రపాక శివారు గోపాలపురం గ్రామంలో కోడి పందాలు నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను వారి వద్ద నుంచి 1080 నగదును, రెండు కోళ్లను, వాటికీ ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మండలంలో ఎవరైనా జూదం నిర్వహిస్తే సహించలేదని ఎస్సై తెలిపారు.