ప్రముఖ దినపత్రిక ఎండి రాధాకృష్ణతో పాటు మరో ఐదుగురికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట న్యాయస్థానం శనివారం నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేశారు. 2017 వ సంవత్సరంలో నమస్తే తెలుగు దినపత్రిక సంపాదకులు ముత్యాల సైదేశ్వరరావుపై అసత్య వార్తలను ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రసరించడంపై పరువు నష్టం దావాను జగ్గయ్యపేట కోర్టులో రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్, సబ్ ఎడిటర్ మాధవి, జగ్గయ్యపేట పాత్రికేయులపై వేయడం జరిగింది.