బందరు డిఎస్పీగా చప్పిడి రాజా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా చప్పిడి రాజా బందర్ సబ్ డివిజన్ కు డిఎస్పీగా బదిలీ అయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. బందర్ సబ్ డివిజన్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన చప్పిడి రాజాకు సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్సైలు స్వాగతం పలికారు.