కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలు మాన్యువల్ పద్ధతిలోనే చేపట్టాలని, తవ్వకాలకు జెసిబి, ప్రొక్లైన్ వంటి యంత్రాలను ఉపయోగించడానికి ఎలాంటి అనుమతులు లేవని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ వాహన రవాణాదారులకు స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం ఆయన మచిలీపట్నం కలెక్టరేట్ లోని మీకోసం సమావేశపు మందిరంలో జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఇసుక తవ్వకాలపై రవాణాదారులతో సమావేశమై సూచనలు చేశారు