మచిలీపట్నం: ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టాలి
జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సాగునీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రాదేశిక నియోజకవర్గం ఆధారంగా ఓటర్ల జాబితా తయారు చేయాలని తెలిపారు.