మచిలీపట్నం: పంటల బీమా పై అవగాహన కల్పించాలి

56చూసినవారు
మచిలీపట్నం: పంటల బీమా పై అవగాహన కల్పించాలి
పంటల బీమా పై జిల్లాలోని రైతులందరికీ వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ పేర్కొన్నారు. గురువారం మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటల బీమా నమోదు చేయించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, కేడీసీసీ సీఈవో మనోహర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్