
మచిలీపట్నం: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ
కృష్ణా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ ఆర్. గంగాధరరావు క్రిస్మస్ శుభాకాంక్షలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పవిత్రమైన పండుగ అందరి జీవితాలలో ఆనందం, శాంతి, సోదరభావం నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఈ పండుగను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు.