ఎన్టీఆర్ జిల్లా, నందిగామ పట్టణంలోని 5, 13వ వార్డులో గురువారం నందిగామ పురపాలక సంఘం కమిషనర్ ఈ. వి. రమణ బాబు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో భాగంగా పాత బస్టాండ్, గాంధీ సెంటర్ ప్రధాన రహదారిలో పైపులైను పరిశీలించారు. మరమ్మత్తులు చేయించి ప్రజలకు మంచి నీటి సరఫరాకు అంతరాయము కలుగకుండా చర్యలు తీసుకొనవలసినదిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.