పెదపారుపూడి మండలం మహేశ్వరపురంలో స్థానిక ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం పర్యటించారు. గ్రామంలో ధాన్యం ఎగుమతి చేస్తున్న రైతులతో ఆయన మాట్లాడారు. రైతులంతా ఒకేసారి కోత కోయడం వల్ల లారీలు దొరకడం సమస్య అయిందని వర్ల రైతులకు వివరించారు. ధాన్యం విక్రయంలో సమస్య ఎదురైతే తనకు చెప్పాలని, అధికారులతో సమన్వయం చేసుకుని ఆయా సమస్యను తక్షణమే పరిష్కరిస్తామన్నారు.