పామర్రులో సెంచరీకి చేరువలో టమాటా ధర

60చూసినవారు
పామర్రులో సెంచరీకి చేరువలో టమాటా ధర
మార్కెట్ లో టమాటా ధరలకు రెక్కలు రావటంతో పామర్రులో టమాటా ధర సెంచరీకి చేరువలో చేరింది. నెల కిందట వరకు కిలో రూ. 30 నుంచి 40 ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా రూ. 100 కు దగ్గరలో ఉంది. ప్రస్తుతం రైతు బజార్లు, హోల్ సేల్ లో కిలో రూ. 70 నుంచి 80 ఉండగా రిటైల్ మార్కెట్ లో దాదాపు రూ. 100 పలుకుతుంది. కాగా డిమాండ్ కు సరిపడా టమాటా మార్కెట్లో లేకపోవడం వల్లే ధర పెరుగుదలకు కారణమని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్