పెడన నియోజకవర్గం నీటిసంఘం ఎన్నిక వేడెక్కింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ప్రసాద్ రెబల్ గా పోటీకి దిగటంతో అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పెడన మండల అధ్యక్షుడు శలపాటి ప్రసాద్ శనివారం రెబల్ అభ్యర్థిని బుజ్జగించే పనిలో పడ్డారు. కాగా రెబల్ అభ్యర్థి పార్టీకి పనిచేసిన తనను కాదని వైసీపీని భుజాలపై మోసిన వ్యక్తికి మీరు మద్దత్తు ఇవ్వటం ఏమిటని నాయకులను ప్రశ్నించారు.