పెడన పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపర్చి, పట్టణాన్ని సుందరీకరణ చేసేదానికి కృషి చేస్తానని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సోమవారం పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయంలో 15వ ఆర్థిక సంఘం నిధులు వెచ్చించి పారిశుద్ధ్యం మెరుగుపరచటానికి కొనుగోలు చేసిన ట్రాక్టర్లు, పుష్కార్టులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ కటకం నాగకుమారి, కమిషనర్ గోపాలరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.