ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం పెనమలూరు నియోజకవర్గంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని తాడిగడప 100 అడుగుల రోడ్డులో గల శ్రీ చైతన్య కళాశాల సరస్వతి భవన్ లో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. తన కుమార్తెకు ఎటువంటి అనారోగ్యం లేదని, తన కుమార్తె చావుకి కళాశాల యాజమాన్యమే బాధ్యులని విద్యార్థిని తల్లి ఆరోపిస్తుంది.