గత ప్రభుత్వం తనకి ప్రకటించిన ఆర్థిక సాయం అందించకుండా నిర్లక్ష్యం వహించిందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఆర్థిక సాయం ఇప్పించి ప్రోత్సహించాలని పర్వతాహరోహకుడు రామావత్ చిన్నికృష్ణ విజయవాడ ఎంపి కేశినేనిశివనాథ్ ను కోరారు. గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంట్ కార్యాలయంఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం రామావత్ చిన్నికృష్ణ ఎంపిను కలిసి గత ప్రభుత్వంలో తనకి జరిగిన అన్యాయంవివరించారు.