ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా జిల్లా పరిధిలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరక్కుండా అన్ని రకాల మద్యం దుకాణాలను 48 గంటలపాటు మూసి ఉంచాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సోమవారం తెలిపారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయం జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు.