వర్షాలకు చేనేత మగ్గాల్లోకి నీరు చేరి ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ఉత్తర అమెరికా పద్మశాలీ అసోసియేషన్, అఖిల భారత పద్మశాలీ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో 200 చేనేత కుటుంబాలకు రూ. 5 లక్షల విలువైన నిత్యావసరాలను ఘంటసాలలో బుధవారం పంపిణీ చేశారు. ఘంటసాల గ్రామంలోని ఏపీ పద్మశాలీ సంఘం జనరల్ సెక్రటరీ అందె జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.